Site icon TeluguMirchi.com

Bhimaa Trailer : పవర్ ఫుల్ గా ‘భీమా’ ట్రైలర్..


మాచో స్టార్ గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్ , మాళవిక శర్మ హీరోయిన్స్. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోమోకు అన్ని వైపులా నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో డోస్ పెంచారు. ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్ గా చేశారు.

సినిమాలోని ఆధ్యాత్మిక కోణాన్ని చూపిస్తూ ట్రైలర్‌ అద్భుతంగా ఓపెన్ అవుతుంది. శ్రీమహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు, భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు. ట్రైలర్‌లో గోపీచంద్‌లోని మరో పాత్రను కూడా చాలా అద్భుతంగా పరిచయం చేశారు.

గోపీచంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో మెస్మరైజ్ చేశారు. అతను కనికరం లేని పోలీసుగా కనిపిస్తుండగా, మరో అవతార్ చాలా టెర్రిఫిక్ గా ఉంది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. డైలాగ్స్ ఎఫెక్టివ్ గా వున్నాయి. ట్రైలర్ ఖచ్చితంగా సినిమా అంచనాలని మరింతగా పెంచింది. ‘భీమా’ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది.

Bhimaa - Official Trailer | Gopichand | A. Harsha | Ravi Basrur | Sri Sathya Sai Arts

Exit mobile version