Site icon TeluguMirchi.com

Bhimaa : ‘భీమా’ టైటిల్ సాంగ్‌ రిలీజ్.. నువ్వు బ్యాండు కొట్టు మామ..!


మాచో స్టార్ గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ టీజర్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. గోపీచంద్, మాళవిక శర్మల అందమైన కెమిస్ట్రీని చూపించిన ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మించిన ఈ చిత్రం సెకండ్ సింగిల్ గల్లీ సౌండుల్లో పాటని విడుదల చేశారు.

లైవ్లీ కంపోజిషన్‌కు పేరుపొందిన రవి బస్రూర్ గూస్‌బంప్స్ తెప్పించే మ్యాసీవ్ ట్రాక్‌ని స్కోర్ చేసారు. గోపీచంద్ పాత్ర గురించి చెప్పే టైటిల్ ట్రాక్ ఇది. తను నేరస్తులను భయపెట్టే ఆరోగెంట్ పోలీసు. సంతోష్ వెంకీ వోకల్స్ పాటలోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కంపోజర్ రవి బస్రూర్, సింగర్ సంతోష్ వెంకీ కలిసి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘భీమా’ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది.

Galli Soundullo - Lyrical | Bhimaa | Gopichand | A. Harsha | Ravi Basrur | Santhosh Venky

Exit mobile version