Site icon TeluguMirchi.com

Bhimaa : రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు..


మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’. ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పలు పోస్టర్స్ గోపీచంద్ ను యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో ప్రజెంట్ చేశాయి. తాజాగా ఈ సినిమా కి సంబందించిన టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు మేకర్స్.

“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్.. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ , ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అనే భగవద్గీత శ్లోకాల పవర్ ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ‘ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా’ అంటూ ఎద్దుపై కూర్చొని మ్యాసివ్, వైల్డ్ అవతారంలో వున్న గోపీచంద్ ని ఎలివేట్ విధానం చాలా బాగుంది. టీజర్ ద్వారా సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేసారు మేకర్స్.

ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ‘భీమా’ ఫిబ్రవరి 16, 2024న ప్రేక్షకుల ముందుకు రానుందని టీజర్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్.

Bhimaa Teaser | Gopichand | A Harsha | Ravi Basrur | Sri Sathya Sai Arts

Exit mobile version