Bhimaa Review
TeluguMirchi Rating : 3/5
టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ కు ఈ మధ్య హిట్ సినిమాలు లేవు. గతంలో వచ్చిన రామబాణం సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు.. ఇప్పుడు భీమా సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై KK రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కొనసాగిందా.. లేదా భీమాగా గోపీచంద్ పంచిన వినోదాలు గురించి తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
NBK 109 Glimpse : హంటింగ్ మొదలెట్టిన బాలయ్య..
మహేంద్రగిరి అనే ఊరిలో భవాని ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి. అతని మాటని ఆ ఊరు పాటించాల్సిందే. ఆయనకు ఎదురు తిరిగిన వారిని వదిలిపెట్టడు. అలా ఒక ఎస్సైని చంపేస్తాడు. దాంతో ఆ తర్వాత భీమా గోపీచంద్ ఆ ప్రాంతానికి ఎస్సైగా వస్తాడు. భవాని తన టాంకర్ల దగ్గరికి వచ్చిన వారిని ఊరుకోడు. కానీ భీమా భవాని టాంకర్ల జోలికి వస్తాడు. అసలు ఆ టాంకర్లలో ఏం ఉంది? విద్య ఎవరు? భవాని టాంకర్ల జోలికి వెళ్ళాక భీమా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు ? గుడి మూసివేయ్యడానికి అసలు కారణాలు ఏంటి అనేది సినిమాలో చక్కగా చూపించారు.. డైరెక్టర్ అనుకున్నది చక్కగా చూపించారు.
Gaami Review | గామి రివ్యూ : డీసెంట్ అట్టెంప్ట్
గోపీచంద్ కి పోలీస్ పాత్ర చాలా బాగా సూట్ అయ్యింది. అలాగే మరొక పాత్రలో కూడా గోపీచంద్ కనిపించారు. రామా అనే పాత్రలో కూడా గోపీచంద్ చాలా బాగా నటించారు. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశారని పబ్లిక్ చెబుతున్నారు. హీరోయిన్, హీరోల లవ్ ట్రాక్ సెట్ అవ్వలేదనే టాక్ వినిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు టెక్నకికల్ టీమ్ బాగా కష్టపడి అవుట్ ఫుట్ ను చూపించారు. మాస్ ఫ్యాన్స్ కు సరికొత్త అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి.
Kalki 2898 AD : భైరవ గా ప్రభాస్.. లుక్ అదుర్స్ !