Site icon TeluguMirchi.com

బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్..


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు గుడ్ న్యూస్ వినబోతున్నారు. నా పేరు సూర్య తర్వాత చాల గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ చిత్రం సెట్స్ ఫై ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు బన్నీ. కాగా అభిమానులు గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ సినిమాలకు సంబందించిన అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణం లో బన్నీ పిఆర్ అభిమానులు అతి త్వరలో ఓ హాట్ న్యూస్ వినబోతున్నారని తెలిపారు. దీంతో ఆ న్యూస్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిందా లేకపోతే వేరే సినిమాకుకు సబందించినదా లేకుంటే వేరే కొత్త విశేషం ఏమైనా ఉందా..అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఇక త్రివిక్రమ్ సినిమా విషయానికి వస్తే ఫాదర్ సెంటిమెంట్ తో ఈ చిత్రం రాబోతుందని అంటున్నారు. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version