జ‌గ‌ప‌తి బాబుకి మంచి రోజులు వ‌స్తాయా?

jagapathi-babuమినిమం గ్యారెంటీ హీరోగా, ఫ్యామిలీ హీరోగా మ‌న్నన‌లు పొందారు జ‌గ‌ప‌తిబాబు. ఒక ద‌శ‌లో ఆయ‌న బండి య‌మ‌స్పీడుగా ఉండేది. అతిథి పాత్రలు కూడా ఒప్పేసుకోవ‌డంతో… ఖాళీ ఉండేదే కాదు. ఇప్పుడు విజ‌యాలూ లేవు, చేతిలో సినిమాలూ లేవు. మంచి సినిమాప‌డి చాలాకాలం అయ్యింది. ఈసారి త‌న‌కు క‌చ్చితంగా బ్రేక్ వ‌స్తుంద‌ని జ‌గ‌ప‌తి బాబు న‌మ్ముతున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘రుధిరం’. దీప్సిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సంతోష్ ద‌ర్శకుడు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకొంది. జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ ”చాలా కాలం త‌ర‌వాత యాక్షన్ సినిమా చేస్తున్నా. ర‌క్తపాతాలు లేని థ్రిల్లర్ చిత్రం ఇది. ద‌ర్శకుడు ఈ సినిమాని బాగా తీర్చిదిద్దుతున్నాడు” అన్నారు. జ‌గ‌ప‌తి బాబు న‌టించిన ఏప్రిల్ ఫూల్ కూడా త్వర‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలూ జ‌గ‌ప‌తి కెరీర్‌ ని ఏ దిశ‌లో మ‌ళ్లిస్తాయో చూడాలి.