గొల్లభామలో న‌టిస్తారా??

Srikanth-Addalas-Gollabhama-Movie-Story1-250x200మీరు కాస్త చూడ‌బుల్‌గా ఉంటారా..? న‌ట‌న‌పై ఆస‌క్తి ఉందా?? అయితే ఇంకెందుకు ఆల‌స్యం..?? గొల్లభామ టీమ్ మీకోస‌మే ఎదురుచూస్తోంది. నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా అరంగేట్రం చేస్తున్న సినిమా గొల్లభామ‌. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శకత్వం వ‌హిస్తారు. జ‌న‌వ‌రిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం మిగిలిన న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. అందుకోసం చిత్రబృందం టాలెంట్ హంట్ నిర్వహిస్తోంది. ఔత్సాహిక యువ‌తీ యువ‌కులు గొల్లభామ‌2014@జీమెయిల్‌.కామ్ కి త‌మ ఫొటోలు, వివ‌రాల‌ను పంప‌వ‌చ్చు. గోదావ‌రి నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. భీమ‌వ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతారు. మ‌రి మీ ఫోటోల‌ను ఇప్పుడే పంపండి.