Site icon TeluguMirchi.com

నాన్న కోసం.. ఓ కానుక‌!

krishna-birthdayమే 31… ఈ తేదీ ప్రత్యేక‌త ఏమిటో…. సూప‌ర్ స్టార్ కృష్ణ అభిమానుల‌కు ప్రత్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. అది కృష్ణ పుట్టిన రోజు! ఈయేడాది మ‌హేష్‌ బాబు ఈ తేదీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాల‌ని ఫిక్సయ్యాడు. తండ్రికి ఓ ప్రత్యేకమైన కానుక ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్ సినిమాలో న‌టిస్తున్నాడు ప్రిన్స్‌. ఈ సినిమా ఫ‌స్ట్‌ లుక్‌ ని ఆ రోజు విడుద‌ల చేసి.. తండ్రికి కానుక‌గా ఇవ్వాల‌నుకొన్నాడు. కానీ దానికి ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టేట్టు ఉంది. అందుకే ఆ స్థానంలో ఓ ప్రత్యేక కానుక అందిస్తున్నాడ‌ట‌. ఇటీవ‌ల మ‌హేష్ వేస‌వి విడిది కోసం విదేశాల‌కు వెళ్లాడు. అక్కడి నుంచే తండ్రికి పుట్టిన రోజు కానుక కూడా తెచ్చాడ‌ట‌. అదేమిటి అనేది ఎవ్వరికీ తెలియ‌నివ్వడం లేదు. మే 31 వ‌ర‌కూ ఆ కానుక ఏమిట‌నేది సూప‌ర్ స్టార్‌ కి సైతం స‌స్పెన్సే!!

Exit mobile version