బాహుబలి మూవీ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా, తాజాగా ఘాజీ చిత్రం తో ఈరోజు తెలుగు , తమిళ్ , హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1971లో ఇండియా, పాకిస్థాన్ ల మధ్య సముద్రంపు అడుగున జరిగిన యుద్ధమే ఘాజీ కథ..ఎవరికీ తెలియని కథ కావడం , మూడు భాషల్లో రిలీజ్ కావడం , హిందీ లో ప్రముఖ డైరెక్టర్ కరణ్ జోహార్ విడుదల చేయడం తో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అంతటా బాగా పెరగడం తో తెలుగు.. హిందీ..తమిళ భాషల్లో ఓవర్సీస్ తో కలుపుకుని సుమారు 3500 స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేసారు.
ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియర్ షోలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్.. విజయవాడల్లో ప్రదర్శించారు. రివ్యూస్ కూడా మంచి రేటింగ్ ఇవ్వడం తో పాజిటివ్ టాక్ తో సినిమా రిలీజ్ అయ్యింది. పీవీపీ.. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీ నిర్మించారు. ఇప్పటికే వారం పాటు టికెట్స్ బుకింగ్ అయిపోయాయని తెలుస్తుంది. మొత్తానికి రానా బాహుబలి తర్వాత ఆ రేంజ్ చిత్రం చేసాడని అంటున్నారు. ఇక సినీ ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.