Site icon TeluguMirchi.com

అసలు గీత ‘అను’నేనట..

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో చెప్పాల్సిన పనే లేదు. విజయ్ ను ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. పరుశురాం డైరెక్షన్లో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ లో రష్మిక హీరోయిన్ గా నటించింది. విజయ్ – రష్మిక ల నటన సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ మూవీ తర్వాత రష్మిక బిజీ స్టార్ అయ్యింది. అయితే ఈ సినిమాకు ముందుగా అను ఇమాన్యూల్ ను కూడా అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయం గా అనునే తెలిపింది.

తనకు ‘గీతాగోవిందం’ చిత్రంలో గీత పాత్ర ఆఫర్ వచ్చిన సమయంలో అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ చిత్రంలో నటిస్తున్నాను. బన్నీ చిత్రంకు బల్క్ డేట్లు ఇచ్చిన కారణంగా పరుశురామ్ అడిగిన డేట్లను ఇవ్వలేక పోయాను. పాత్ర లేదా హీరో నచ్చక తాను గీత గోవిందం చిత్రాన్ని రిజక్ట్ చేయలేదని డేట్లు కుదరక పోవడం వల్లే ఆ ఆఫర్ ను వదుకోవాల్సి వచ్చిందని అను చెప్పుకొచ్చింది. గీత పాత్రను మిస్ అవ్వడం కెరీర్ లోనే అతి పెద్ద మైనస్ గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తుండగా కొన్ని చర్చల దశలో ఉన్నట్లు తెలిపింది.

Exit mobile version