Site icon TeluguMirchi.com

బాలకృష్ణ 100 వ చిత్రం ఆగిపోయింది.

balakrishana-100th-fil-stopనందమూరి బాలకృష్ణ 100 వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ షూటింగ్ ఆగిపోయిందనే సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగిపోవడమేంటి అని ఖంగారు పడుతున్నారు. అసలు సంగతి ఏంటి అంటే చిత్ర దర్శకుడు క్రిష్ మరి కొద్దీ రోజుల్లో ఓ ఇంటివాడు కాబుతున్నాడు. ఆగస్టు 8 న రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. పెళ్లి టైం దగ్గర పడడం తో క్రిష్ పెళ్లి పనుల్లో బిజీ అయ్యాడట. దీంతో గౌతమి పుత్ర శాతకర్ణి కు బ్రేక్ ఇచ్చాడట బాలయ్య. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా శ్రీయ నటిస్తుంది. క్రిష్ పెళ్లి అనంతరం మళ్ళీ షూటింగ్ మొదలు కానుంది.

Exit mobile version