Site icon TeluguMirchi.com

కరోనా పై గంభీర్‌ నిర్ణయం

కరోనా వైరస్ కారణంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ.. సాయం చేయడానికి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. తాజాగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ భారీ విరాళం ప్రకటించారు. ఎంపీగా తనకు వచ్చే రెండేళ్ల వేతనాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చాడు.

ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘దేశం తమ కోసం ఏం చేసిందని ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ దేశం కోసం మనం ఏం చేశామన్నది అసలు ప్రశ్న. నేను నా రెండేళ్ల జీతాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందిస్తున్నాను. మీరు కూడా తోచినంత సహాయం చేయండి’అంటూ గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్‌ చేశారు.

Exit mobile version