Site icon TeluguMirchi.com

సైరా అన్నకు పాదాభివందనం చేసిన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్..

కమెడియన్ గా కెరియర్ మొదలు పెట్టిన బండ్ల గణేష్..ఆ తర్వాత సినిమా ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టి గబ్బర్ సింగ్, టెంపర్ మొదలగు చిత్రాలను నిర్మించి అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సినిమా నిర్మాణానికి దూరమైన గణేష్..తాజాగా మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇదిలా ఉంటె ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన సైరా చిత్రం పట్ల తన ట్విట్టర్ లో మెగా ట్వీట్ చేసి మెగా అభిమానులను ఆకట్టుకున్నారు. తెలుగువాడి సత్తాను మరోసారి సినీ ప్రపంచానికి చాటిచెప్పిన మా సైరా అన్నకు పాదాభివందనం అంటూ చిరంజీవిని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అంతకు ముందు రామ్ చరణ్ ‌పై కూడా గణేష్ ట్వీట్ చేశారు.

‘మళ్ళీ మీతో ఒక సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బాస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్’ అంటూ తన కోరికను తెలిపాడు.

Exit mobile version