Site icon TeluguMirchi.com

మరోసారి బండ్ల గణేష్..పవన్ ను ఆకాశానికి ఎత్తాడు

పవన్ కళ్యాణ్ పేరు చెపితే చాలు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎంతలా ఉగిపోతాడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ నా ప్రాణం..నా ఊపిరి ఆయన్ను ఎవరైనా ఒక్క మాట అంటే అసలు ఊరుకోను అని చాల సందర్భాలలో, చాల వేదికల ఫై బండ్ల గణేష్ చెప్పిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తాడు ఈ వీరాభిమాని.

తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి కి సిద్ధం కావడం , ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగిపోవడం తెల్సిందే. అయితే ఈమె రెండో పెళ్లి పట్ల పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా విషెష్ తెలియజేసాడు. `కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్న రేణుగారికి నా శుభాకాంక్ష‌లు. ఆమె ఎల్ల‌ప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ఆ దేవుణ్ని ప్రార్థిస్తాన‌`ని ప‌వ‌న్ ట్వీట్ చేసాడు. పవన్ చేసిన ట్వీట్ పట్ల అందరూ హర్షం వ్యక్తం చేసారు.

ప‌వ‌న్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బండ్ల గ‌ణేష్‌.. `మా బాస్ అంటే ఇది` అంటూ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Exit mobile version