అత్తారింటికి దారేది సినిమాకి అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయి. వీకెండ్లో ఈ సినిమా వసూళ్లను దున్నుకొంది. ఎంత పెద్ద సినిమా అయినా వీక్ డేస్‌లో వసూళ్లు డల్‌గా ఉంటాయ్. కానీ బుధవారం ఈ సినిమాకి బంపర్ ఆఫర్ తగిలింది. గాంధీ జయంతి సందర్భంగా సెలవు రావడంతో అత్తారింటికి కలిసొచ్చింది. సోమ, మంగళ వారాల్లో హౌస్ ఫుల్కి కాస్త అటూ ఇటూ ఉన్న అత్తారింటికి దారేది థియేటర్లు… బుధవారం మళ్లీ పండగ చేసుకొన్నాయి. ఒక్క బుధవారమే రాష్ట్ర్రం మొత్తమ్మీద దాదాపుగా రూ.4.5 కోట్లు వసూలు చేసిందీ సినిమా. అలా.. గాంధీ కూడా పవన్‌కే సపోర్ట్ చేశాడన్నమాట.