Site icon TeluguMirchi.com

‘స్కంద’ నుంచి ‘గండరబాయి’ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో ఇరగదీసిన రామ్, శ్రీలీల


ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్కంద’. ది ఎటాకర్ అనేది ఉపశీర్షిక. ఇక మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన మొదటి పాట చార్ట్‌బస్టర్‌గా నిలవగా, తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ గండరబాయి లిరికల్ వీడియోని విడుదల చేశారు.

ఎస్ఎస్ థమన్ మరో బ్లాక్ బస్టర్ నంబర్‌ను అందించారు. మొదటి పాట ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అయితే, గండరబాయి మాస్ ధమకేధార్ ఫోక్లోర్. బీట్, ఆర్కెస్ట్రేషన్ ఎనర్జిటిక్ గా మాస్ వైబ్‌తో ఆకట్టుకున్నాయి. నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల వాయిస్ మెస్మరైజ్ చేసింది. అనంత శ్రీరామ్ మాస్ లిరిక్స్ రాసిన ఈ పాటను వైబ్రెంట్ సెట్స్ లో చిత్రీకరించారు.

ఇక రామ్, శ్రీలీల అయితే తమ ఎనర్జీతో ప్రేక్షకుల మనసుని కొల్లకొట్టారు. ఎక్సట్రాడినరీ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. రామ్ డ్యాన్స్‌లో డైనమిజం చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ఈ ఇద్దరు గ్రేట్ డ్యాన్సర్లు. వాళ్ళ డ్యాన్స్ చూడ్డానికి రెండు కళ్లు చాలవు. నాటు నాటు సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈపాటకు కొరియోగ్రఫీ చేశారు.

Gandarabai | Lyrical Video (Telugu) | Skanda | Ram Pothineni, Sree Leela | Boyapati Sreenu |Thaman S

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version