Site icon TeluguMirchi.com

Gaami : హార్ట్ టచింగ్ గా ‘గామి’ నుంచి ‘గమ్యాన్నే చేధించే’ సాంగ్..


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘గామి’. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, క్యారెక్టర్‌ పోస్టర్స్‌తో పాటు చిన్న టీజర్‌ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు, మ్యూజికల్ జర్నీ టైం. మేకర్స్ ఫస్ట్ సింగిల్ గమ్యాన్నే పాటని ఈరోజు విడుదల చేశారు.

“సొమ్మసిల్లపోయి కూలింది కాలం.. సత్తువంతు లేక ఇంకెంతకాలం.. సన్నగిల్లకుంది ఈ వింత దూరం.. దిక్కుతోచకుండా ఇంకెంత దూరం.. గమ్యాన్నే ఛేదించే” అంటూ సాగే ఈ పాట హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సనాపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం ఆకట్టుకుంది. సుగుణమ్మ, అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తీల అద్భుత గానం మరింత ఆకర్షణీయంగా వుంది. మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా విశ్వక్ సేన్ భావోద్వేగాలను అద్భుతంగా పండించారు.

విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో వెరీ టాలెంటెడ్ చాందినీ చౌదరి కథానాయిక. హారిక పెడదా, మరియు మహమ్మద్ సమద్ ఇతర ప్రముఖ తారాగణం. గామి ట్రైలర్ ఫిబ్రవరి 29 న విడుదల కానుంది. నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు.

Gaami | Gamyaanne - The Quest Song | Vishwak Sen | Chandini Chowdary | Sweekar Agasthi

Exit mobile version