Site icon TeluguMirchi.com

దండకారణ్యం లో గద్ధర్

gaddar-dandakaranyam
స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌.నారాయణమూర్తి దర్శక నిర్మాతగా రూపొందిస్తోన్న చిత్రం ‘దండకారణ్యం’. ఆర్‌.నారాయణమూర్తి, త్రినాథ్‌, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్‌ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘సీతారాములు త్రేతాయుగంలో, పాండవులు ద్వాపర యుగంలో అరణ్యవాసం చేసేటప్పుడు దండకారణ్యంలోనే ఉన్నారు. అలాంటి దండకారణ్యం ఇప్పుడు సమస్యతో కొట్టుమిట్టాడుతుంది. ప్రభుత్వం చేపట్టే బాక్సైట్‌, గనుల తవ్వకాల్లో అక్కడున్న అదివాసీలకు మనుగడ లేకుండా పోతుంది. ఆదివాసీ హక్కుల గురించి తెలియజేసే చిత్రమే ‘దండకారణ్యం’. ఈ సినిమాలో ఏడు పాటల్లో మూడు పాటను గద్దర్‌ పాడారు. పాటులు చాలా అద్భుతంగా పాడారాయన. అలాగే నాలుగు పాటలను వందేమాతరం శ్రీనివాస్‌ పాడారు. గోరేటి వెంకన్న, ములుగు తిరుపతి, కాశీపతి సాహిత్యమందించారు. బొబ్బిలి, అరకు, విజయనగరం, ప్వాంచ, రంపచోడవరం, పాపికొండలు, చతీష్‌ గడ్‌ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రీరికార్డింగ్‌, ఫైనల్‌ మిక్సింగ్‌ పను జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్‌, కథ, చిత్రానువాదం, మాటు, ఎడిటింగ్‌, కొరియోగ్రఫీ, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్‌.నారాయణమూర్తి.

Exit mobile version