Site icon TeluguMirchi.com

రాజ‌కీయాల్లోకి గ‌బ్బ‌ర్ సింగ్‌

pawan-kalyan-political-partyప‌వన్ క‌ల్యాణ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎమ్మెల్యేగా నిల‌బ‌డ్డాడు. భారీ మెజార్టీతో గెలిచాడు.. అప్ప‌టి నుంచి రాజ‌కీయ నాయ‌కుల‌తోనూ, ఈ అవినీతి వ్య‌వ‌స్థ‌తోనూ చెడుగుడు ఆడ‌డం మొద‌లెట్టేశాడు. ఎప్పుడు? ఎక్క‌డ ? ఎలా? అనుకొంటున్నారా? ఇవ‌న్నీ నిజ జీవితంలో కాదులెండి. సినిమా కోసం. ప‌వ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్ 2. ఈ చిత్ర క‌థ లీక్ అయ్యింది. అది సింపుల్ గా మొద‌టి రెండు లైన్ల‌లో చెప్పిందే! ఓ నిజాయ‌తీగల పోలీస్ ఆఫీస‌ర్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది గ‌బ్బ‌ర్ సింగ్ 2 క‌థట‌. ఈ క‌థ కేవ‌లం ఊహాజ‌నిత‌మా? నిజ‌మా? అన్న‌ది మాత్రం తేల‌డం లేదు. ఈ విష‌య‌మై సంప‌త్ నందిని అడిగితే ”గ‌బ్బ‌ర్ క‌థ గురించి ఇప్పుడే చెప్పేస్తే ఎలా? ఇంకొంత కాలం ఆగండి…” అంటున్నారాయ‌న‌.

Exit mobile version