చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటున్న గబ్బర్ సింగ్ 2…

DSP-gabbarsingh2పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి , కష్టపడి చేయబోతున్న చిత్రం గబ్బర్ సింగ్ 2. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు సెట్స్ ఫై ఈ నెల 29 న రానుంది. పవర్ చిత్ర డైరెక్ట్ కె.ఎస్ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ మరోసారి పవన్ తో జత కట్టనున్నాడు. ఈ చిత్రానికి సంబధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో డైరెక్టర్ తో కలిసి దేవి శ్రీ చేస్తున్నాడు.

పవన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన శరత్ మరార్చి ఈ చిత్రానికి నిర్మాత గా బాధ్యత వహిస్తున్నాడు. అలాగే అనీషా ఆంబ్రోస్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తో పాటు పవన్ త్రివిక్రమ్ దర్శకత్వం లో ‘కోబలి ‘ చిత్రం కూడా చేయనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కి గబ్బర్ సింగ్ 2 ప్రేక్షేకుల ముందుకు రానుంది.