Site icon TeluguMirchi.com

‘గబ్బర్ సింగ్ 2’ హీరోయిన్ చేంజ్..?

Pawan-Anisha‘పవర్’ ఫేం బాబి దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘గబ్బర్ సింగ్ 2’. ఈ మద్యనే పూణే లో షూటింగ్ మొదలు పెట్టుకున్న విజయవంతగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతున్న క్రమంలో చిత్ర హీరోయిన్ ఫై ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది..ఏంటి ఆ న్యూస్ అంటే..

చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అనీషా అంబ్రోస్..పవర్ స్టార్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది..అలాంటి ఇమెను ఈ చిత్రం నుండి తప్పిస్తున్నారని వార్త. ఇమె నటన ఫై పవన్ అసంతృప్తి తో ఉన్నాడని,ఇమె ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకునేందుకు చిత్ర యూనిట్ చూస్తుందనే వార్త ప్రచారం జరుగుతుంది..కానీ మరికొంత మంది మాత్రం అలాంటిదేమీ లేదని , ఇంతవరకు హీరోయిన్ ఫై షూటింగ్ జరగలేదని అంటున్నారు. ఏది ఏమైనా ఈరకంగా కూడా గబ్బర్ సింగ్ 2 నెట్ లో ఫ్రీ పబ్లిసిటీ అవుతుందని ఫాన్స్ సంబరపడుతున్నారు.

Exit mobile version