గబ్బర్ సింగ్ 2 ఫస్ట్ లుక్

Gabbar-Singh2-first-lookలేటుగా వచ్చిన రావడం పక్కా అంటూ పవన్ గోపాల గోపాల చిత్రం లో పేల్చినా డైలాగ్ ఇప్పుడు నిజం చేయబోతున్నాడు. కొంతకాలంగా ఆలస్యం అవుతూ వచ్చిన గబ్బర్ సింగ్ 2 ఎట్టకేలకు మొదలు పెట్టుకొని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే పూణే లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నఈ చిత్రం అతి త్వరలో రెండో షెడ్యూల్ కు రెడీ అవుతోంది.

తాజా విషయం ఎంటింటే ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ 2 ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలనీ పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట. ఈ గుడ్ న్యూస్ మెగా ఫాన్స్ లో సంతోషాన్ని నింపుతుంది. అంతే కాకుండా పవన్ పుట్టినరోజున అభిమానులకు గబ్బర్ సింగ్ 2 ట్రైలర్ ను విడుదల చేయాలనీ ట్రై చేస్తున్నాడు పవన్. మొత్తానికి రెండు నెలలో రెండు మెగా బంపర్ ఆఫర్స్ రావడం తో అబిమానులు ఆనందిస్తున్నారు.

పవన్ కు జోడిగా అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా సంక్రాంతి బరిలో నిలబడుతోంది. బాబీ డైరక్షన్ లో దేవిశ్రీ సంగీతం సమకూర్చుతున్న ఈసినిమాకు శరత్ మరార్ నిర్మాత.