Site icon TeluguMirchi.com

‘గబ్బర్ సింగ్-2’ డైలాగ్స్ ఇవేనా ?

pavanపవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ ఇంకా సెట్స్ పైకే వెళ్ళలేదు. కాని అప్పుడే లీకుల గొడవ మొదలైంది. గబ్బర్ సింగ్ 2 డైలాగులు ఇవే అంటూ ఓ మూడు డైలాగులు నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. నేను టెంపర్ లాస్ అయితే…టెంపో లేకుండా కొడతా’ ‘. ఫస్ట్ పార్టులో నా తిక్కకి లెక్క ఉందిరోయ్…ఈ పార్టులో లెక్కే లేదు’. మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు చుక్కలు చూపిస్తా.. అనే పంచ్ డైలాగ్స్ తెగ సందడి చేస్తున్నాయి. అయితే ఇవి నిజంగానే ‘గబ్బర్ సింగ్-2 చిత్రంలోని డైలాగులేనా? అంటే మాత్రం క్లారిటీ లేదు. ఇక ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్టు వర్కు పూర్తి చేసారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి.’గబ్బర్ సింగ్ 2’ కధ మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని వినికిడి. హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.

Exit mobile version