వైజాగ్ లో ‘గలాట’

galataచెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా వరుస చిత్రాలతో ముందుకు వెళ్తున్నాడు హీరో శ్రీ. ఇటివలే హీరోగా ‘త‌మాషా’ చిత్రంను ప్రారంభించాడు. మరో చిత్రం సెట్స్ పై వుంది. అదే గలాట . హరిప్రియ హీరోయిన్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో  షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ “పూర్తి వినోదాత్మకంగా సాగే లవ్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఓ నవ్యమైన పాయింట్‌తో తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో శ్రీ పాత్ర కొత్తగా ఉంటుంది. నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని అన్నారు. అలీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.