Site icon TeluguMirchi.com

Gaami Trailer : గామి ట్రైలర్.. ఈ ఫార్మాట్‌లో ఇదే మొదటిసారి


మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత దర్శకత్వంలో చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకోగా.. గమ్యాన్నే చేధించే హార్ట్ టచింగ్ మెలోడీతో చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ను ఫిబ్రవరి 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

2

అయితే ఈ ట్రైలర్ ను సరికొత్తగా PCX ఫార్మాట్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ ట్రైలర్ ను ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో లాంచ్ చేస్తున్నారు. ఇకపోతే PCX ఫార్మాట్‌లో ఆవిష్కరించబడిన మొట్టమొదటి ట్రైలర్ ఇదే కావడం విశేషం. ట్రైలర్ పోస్టర్‌లో విశ్వక్ సేన్‌తో పాటు అఘోరాలు వారి చేతుల్లో కాగడాలు పట్టుకుని వారి ముఖాల్లో తీవ్రతను చూపుతున్నారు. నరేష్ కుమారన్ మరియు స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హారిక పెడదా, మరియు మహమ్మద్ సమద్ ఇతర ప్రముఖ తారాగణం.

Exit mobile version