జగన్ బెయిల్ – అత్తారింటికి లీకేజ్ – సోమవారం అంతా ఈ విషయంపై గరమ్ గరమ్ గా చర్చ నడిచింది. జగన్ గురించి మాట్లాడుకోవడం మానేసినా.. పవన్ టాపిక్ ఊరిస్తూనే ఉంది. అత్తారింటికి దారేది ఫస్టాఫ్ ఎవరు చూశారు, సినిమా ఎలా ఉంది?? పవన్ ఎలా కనిపించాడు? ఎన్ని పంచ్ డైలాగులు ఉన్నాయ్..? అంటూ అభిమానులు ఆరా తీసుకోవడం మొదలెట్టారు. వారందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.. అత్తారింటికి దారేది ఫస్టాఫ్ సూపర్ హిట్ అట. దాంతో ఫ్యాన్స్ అంతా ఈనెల 27 ఎప్పుడొస్తుందా?? అని ఎదురు చూపుల్లో పడిపోయారు. పైరసీ వల్ల బాధపడినా, తమ హీరో సినిమా ముందే వచ్చేస్తుందనే సంతోషం కూడా ఉంది. పైగా సినిమాకి ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసినట్టే. అందుకే ఈ శుక్రవారం భారీ స్థాయిలో పండగ చేసుకోవడానికి పవన్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. మరి సెకండాఫ్ ఏ రేంజులో ఉంటుందో…?