Site icon TeluguMirchi.com

తెనాలిలో ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం

DSC_7622తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక బోస్రోడ్డులోని వేద డీలక్స్ లో ఈనెల 19వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు రెండో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రధానకార్యదర్శి బొల్లిముంత కృష్ణ మాట్లాడుతూ… ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు చిత్రోత్సవాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారని తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో వివిధ దేశాలకు చెందిన 20 చిత్రాలను ప్రదర్శించనున్నారు. వేద డీలక్స్ ధియేటర్ ను చిత్రాల ప్రదర్శనకు అందంగా తీర్చిదిద్దారు. సొసైటీ తరపున విశిష్ట వ్యక్తుల పేర్లతో పురస్కారాలను అందజేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ పురస్కారాన్ని డి. రామానాయుడుకు ప్రదానం చేస్తామని బొల్లిముంత కృష్ణ తెలిపారు. ప్రతి రోజు జరిగే కార్యక్రమాల్లో అతిథులుగా సినీ ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆయన చెప్పారు.

Exit mobile version