పవన్ తిక్కకు అవార్డులన్నీ దాసోహం అంటున్నాయి. గబ్బర్ సింగ్ పాత్రకు పవన్ కల్యాణ్‌కి ఇటీవలే.. ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ పవన్ వశమైంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ నటుడిగా పవన్ కల్యాణ్ ఎంపికయ్యాడు. ఉత్తమ నటి పురస్కారం సమంత (ఈగ)కు దక్కింది. పవన్ తరపున ఆ అవార్డు… రామ్‌చరణ్ స్వీకరించాడు. ఉత్తమ చిత్రం (ఈగ), ఉత్తమ దర్శకుడు రాజమౌళి (ఈగ) అవార్డులు సొంతం చేసుకొన్నారు