పూరి – విజయ్ దేవరకొండ కలయికలో ఫైటర్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ కి తెలుగు తో పాటు హిందీ లోను మంచి పాపులార్టీ ఉండడం తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కామ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీ లో ఫైటర్ ను రిలీజ్ చేయబోతున్నాడు. ఈరోజు (జనవరి 20 ) నుండి ముంబైలో ‘ఫైటర్’ రెగ్యులర్ షూటింగ్ ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. కాగా ఈ మూవీ లో విజయ్ కి జోడిగా యంగ్ బ్యూటీ అనన్య పాండేను ఎంపిక చేసినట్లు సమాచారం. పూరి చెప్పిన కథ నచ్చడం తో వెంటనే అనన్య ఓకే చెప్పిందట. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. 15 మంది ట్రైనర్స్ విజయ్ దేవరకొండకి మార్షల్ ఆర్ట్స్‌తో పాటు పలు ఫైట్స్‌కి సంబంధించి శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తుంది. తన పాత్ర కోసం విజయ్ డైట్ విషయంలోను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడట. ఇక ఈ చిత్రాన్ని పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు.