శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా చిత్రం మూడు వారం లోను తన దూకుడును కొనసాగిస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే వరల్డ్ వైడ్ గా 60కోట్లు వసూలు చేసి అందర్నీ ఫిదా చేసింది. శేఖర్‌కమ్ముల కెరీర్లెనే అతిపెద్ద హిట్‌గా ఫిదా నిలిచిపోయింది. తెలంగాణ అమ్మాయిగా నటించిన సాయిపల్లవి నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు..కేవలం సినిమా అభిమాని మాత్రమే కాదు రాజకీయ నాయకుడు తెలంగాణ సీఎం సైతం ఫిదా అయ్యాడంటే అర్ధం చేసుకోవాలి అమ్మడి నటన ఎలా ఉందొ..
రెండు వారాల షేర్ రూ.34.8కోట్లు కాగా, గ్రాస్ 60కోట్లుగా ఉందని నిర్మాణవర్గాలు తెలిపాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక చిత్రాల పరాజయంతో వెనుకబడిన శేఖర్‌కమ్ముల ఈ చిత్రంతో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకొచ్చాడు. దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అమెరికాలోనూ తన హవా కొనసాగిస్తోంది.