Site icon TeluguMirchi.com

ఓవర్సీస్‌లో ‘బాహుబలి 2’కి టెన్షనే

baahubali-2-leakదేశ వ్యాప్తంగా ప్రస్తుతం ‘బాహుబలి 2’ పీవర్‌ ఓ రేంజ్‌లో సాగుతుంది. ఈ చిత్రం విడుదలకు రెండు రోజులే ఉండడంతో ఎక్కడ చూసినా కూడా ‘బాహుబలి 2’ పేరే వినిపిస్తుంది. భారీ రేంజ్‌లో అంచనాలు ఉన్న ఈ చిత్ర టికెట్‌ ధరలు ఆకాశానికి అంటేలా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు జేబులు నింపుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా టాక్‌ ఎలా ఉన్నా కూడా ఎవరికి నష్టం కలగకుండా ఉండే విధంగానే విడుదలను ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఇండియాలో ‘బాహుబలి 2’కి సేఫ్‌ జోన్‌ అని ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. ఇకపోతే ఓవర్సీస్‌లోనే బయ్యర్‌లను ఈ చిత్రం కాస్త టెన్షన్‌ పెడుతుంది. మొదటి పార్టు వసూలు చేసినంత సొమ్ముకే రెండో పార్టు అమ్ముడయ్యింది. ఇప్పుడు కూడా కేవలం అంతే వసూలు చేస్తే బయ్యర్‌లకు ఏమి మిగలదు.

మొదటి పార్టు 8 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. దాంతో బయ్యర్‌లు భారీ మొత్తానికి రెండో పార్టును కొనేశారు. ఈ సారి అన్ని ఖర్చులు పోను లాభాలు రావాలంటే 15 మిలియన్‌ డాలర్లను వసూలు చేయాలి. ఇంత మొత్తంలో వసూలు చేయాలంటే అమెరికాలో చాలా కష్టమైనదే. అందుకే టికెట్టు ధరను భారీగా పెంచుతున్నారు. దాంతో అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు బయ్యర్‌లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ వారి బాధ వారిదే కదా. ఓవర్సీస్‌లోనే ఈ చిత్రం వంద కోట్లను వసూలు చేయాల్సి ఉంది. అందుకే టికెట్టు ధరను భారీగా పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి ఓవర్సీస్‌ బయ్యర్‌లను ‘బాహుబలి 2’ బాగానే టెన్షన్‌ పెట్టిస్తోంది.

Exit mobile version