ఈ విషయన్ని నెల్లూరు కు చెందిన రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ ట్రెజరర్ ఎన్ రవి తెలిపారు. వందలాది రజనీ ఫ్యాన్స్ ఏప్రిల్ 2 తేదిన పాదయాత్రగా తిరుపతి బయలు దేరుతున్నాం. రెండేళ్ల తర్వాత కొచ్చడయాన్ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి. అంతేకాకుండా రజనీకాంత్ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తాం అని వివరించారు. ‘కొచ్చడయాన్’ కు రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. రెహ్మాన్ మ్యూజిక్.