Site icon TeluguMirchi.com

ఫ్యాన్స్ క్రియేటివిటీ మాములుగా లేదు…

ప్రస్తుతం సోషల్ మీడియా అంత పవన్ ట్వీట్ల మేనియా తో ట్రాలింగ్ నడుస్తుంది..సినీ స్టార్స్ దగ్గరి నుండి సాధారణ పేస్ బుక్ ఖాతాదారుడు వరకు పవన్ ట్వీట్లను షేర్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన మీడియా చానెల్స్ ఫై పవన్ ఓ రేంజ్ లో కసి తీర్చుకుంటున్నాడు. రోజు వారిపై ఏదో ఓ ట్వీట్ పెట్టి నా తడాఖా చూస్తారా అంటూ వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు. స్వయం గా పవన్ కల్యాణే వార్నింగ్ లు ఇస్తుంటే ఆయన అభిమానులు ఊరుకుంటారా..తమ క్రియేటివిటీ అంత చూపిస్తూ రెచ్చిపోతున్నారు.

తాజాగా వీరు వేసిన ఓ కార్టూన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది..” ఓ దీవిలో చిక్కుకున్న అమ్మాయి హెల్ప్ అంటూ రాళ్లతో మెసేజ్ రాస్తే.. ఎవరూ పట్టించుకోరు. కానీ అదే రాళ్లతో.. పవన్ ను తిట్టిన ఆ బూతు మాట రాస్తే మాత్రం.. ఓ మూడు ఛానల్స్ నేరుగా ఆమె దగ్గర ల్యాండ్ అయిపోయిందుకు వచ్చేస్తున్నాయి. ఛానల్ ప్రతినిధులు ప్యారాచూట్ లతో ఆమె ఉన్న దీవిలో ల్యాండ్ అయిపోతున్నట్లుగా క్రియేట్ చేశారు. ప్రస్తుతం వీరి క్రియేటివిటీ చూసి అందరూ అబ్బా..ఏంచేసార్లే అను కామెంట్స్ వేస్తున్నారు.

Exit mobile version