కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరు కూడా సోషల్ మీడియా లో అసభ్యకర పోస్టులు పెట్టడం కానీ కరోనా ఫై పుకార్లు పుట్టించడం కానీ చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న ఆకతాయిలు మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా సోషల్ మీడియా లో రకరకాల పోస్టులు పెడుతూ ప్రజలను ఖంగారు పట్టిస్తున్నారు. తాజాగా మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ కరోనా తో చనిపోయారంటూ ఓ పుకారు పుట్టించి నానా రచ్చ చేసారు.
ఇది చూసి అభిమానులు కూడా కంగారు పడ్డారు. వెంటనే కొంతమంది ఫ్యాన్స్ ఆ పోస్ట్‌ను చాలా సీరియస్‌గా తీసుకొని సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో వెంటనే కేరళ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ సదరు యువకుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయి పనులు చేస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు.