చంపేస్తానని బెదిరించిన హీరో సునీల్..

sunil-facetoface‘ జక్కన్న ‘ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సునీల్ , ఓ టీవీ జనరలిస్ట్ చంపేస్తాననడం పెద్ద దుమారం లేపుతుంది. వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ టీవీ ఛానల్ టీవీ 9 వారు తాజాగా సునీల్ తో ముఖాముఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. యాంకర్ జాఫర్ , సునీల్ ను కొన్ని ఇబ్బందికర ప్రశ్నలతో విసిగించాడు. అప్పటికి ఓపిక తో సమాధానం చెపుతూ వస్తున్న సునీల్ , తన కోపాన్ని ఆపుకోలేకపోయారు. ఒక్కసారిగా సదరు యాంకర్ ను నువ్వు మరోసారి ఆ ప్రశ్న అడిగితే చంపేస్తానని కోపం గా అనడం తో అక్కడి సిబ్బంది షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద చర్చే మీడియాలో జరుగుతుంది.

ప్రస్తుతం సునీల్ కెరియర్ పెద్దగా చెప్పుకునే మాదిరిగా లేదు. వరుస ప్లాప్స్ తో సతమతం అవుతున్న సునీల్ జక్కన్న తో తన జాతకం మారుతుందని ఆశ పడ్డాడు కానీ జక్కన్న కూడా తనకు చేదు నే మిగల్చడం తో చాల బాధలో ఉన్నాడని సన్నిహితులు చెపుతున్నారు. మరి సునీల్ కు హిట్ ఇచ్చే నాధుడెవరో చూడాలి.