వరుణ్ తేజ్, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, తమన్నా, మెహ్రీన్, సునీల్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3 . నిన్న శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. కథ పెద్దగా లేకపోయినప్పటికీ కామెడీ ఫుల్ గా ఉండడం తో ప్రేక్షకులు చిత్రానికి బ్రహ్మ రధం పడుతున్నారు.
ఇక ఈ మూవీ ఫస్ట్ డే విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తుంది. నైజాంలో తొలి రోజున 4 కోట్లు, ఆంధ్రాలో 6 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తుంది.