‘ధూమ్3’ లో దుమ్ముదులిపారు !

dhoom3ధూమ్ 3..త్వరలో దుమ్మురేపటానికి రెడీ గా వుంది. అమీర్ ఖాన్, కత్రినా జంట గా నటించిన ఈ సినిమా విడుదల కు ముందే ట్రైలర్స్ లో వావ్ అనిపిస్తంది. చిత్రం కోసం ఆమీర్ కత్రినా చేసిన హార్డ్ వర్క్ కూడ సూపర్ అనిపిస్తుంది. సాదార‌ణంగానే అమీర్ ఖాన్ ..సినిమాలో త‌న క్యారెక్టర్ కోసం.. క‌థ డిమాండ్ మేర‌కు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తాడు. ధూమ్ 3 కోసం కూడా ఆమీర్ ఆస్ట్రేలియా వెళ్లి కొన్ని పోరాట విద్యలు, ఓ విలక్షణ నృత్యం నేర్చుకున్నాడు. ఇక ధూమ్ త్రీ మేకింగ్ విడియో లో అమీర్ , క‌త్రీనాలు చేసిన ఆక్రోబాటిక్స్ ఫీట్స్ చూస్తే.. హ‌ట్సాఫ్ అన‌కుండ ఉండ‌లేం. 5 కోట్ల ఖ‌ర్చు పెట్టి .. చాలా వైవిధ్యంగా చేసిన ఒక పాట లో ఆక్రోబాటిక్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండ‌టంతో.. దీని కోసం వీరిద్దరు ఎరో బాటిక్స్ నిపుణ‌ల స‌మక్షంలో కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సాంగ్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఔరా అనిపిస్తుంది. ట్రైలర్స్, మేకింగ్ విడియోలతో రికార్డ్స్ సృష్టిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరో వైపు ధూమ్ 3 విడుద‌ల అవ్వక ముందే నాలుగో సీక్వెల్ కు స‌న్నాహాలు జరిగిపోతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.