‘ఎవరు’ చూసిన ప్రేక్షకులకు టీం విజ్ఞప్తి

అడవి శేషు ప్రధాన పాత్రలో రెజీనా హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ఎవరు’ చిత్రం మంచి టాక్‌ను దక్కించుకుంది. సినిమాలోని ట్విస్ట్‌లు మరియు టర్నింగ్‌లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నాయంటూ రివ్యూలు కూడా వస్తున్నాయి. రివ్యూవర్స్‌ ఈ చిత్రంపై పాజిటివ్‌గా రియాక్ట్‌ అవ్వడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా సినిమా మంచి వసూళ్లతో నిలకడగా సాగుతోంది. ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రేక్షకుల ముందుకు వచ్చి చిన్న రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

సినిమాకు ప్రధాన ఆకర్షణ కథనంలోని ట్విస్ట్‌లు. క్లైమాక్స్‌ మరియు ఇంటర్వెల్‌ సమయంలో వచ్చే ట్విస్ట్‌లను కొందరు వీడియోలు తీసి, కొందరు టెక్ట్స్‌ ద్వారా రివీల్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి ఒకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమా చూడాలనుకునే వారు ఆ ట్విస్ట్‌లను చూస్తే సినిమా చూస్తున్న సమయంలో థ్రిల్‌ మిస్‌ అవుతారు. అందుకే వారికి ఆ థ్రిల్‌ ఉండేలా మీరు దయచేసి ఆ ట్విస్ట్‌లను రివీల్‌ చేయవద్దంటూ ఒక వీడియోను అడవి శేషు విడుదల చేశాడు.