Erracheera : ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎర్రచీర: ది బిగినింగ్’. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో థ్రిల్లింగ్‌గా రూపొందిన ఈ సినిమాను సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా, ఆయన ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం మే రెండో వారంలో వేసవి కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సుమన్ బాబు తెలిపారు. “కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉంటుంది. కామెడీ, హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలగలిపి ఎక్కడా బోర్ కొట్టకుండా సిద్ధం చేసుకున్నాం. సినిమా చూసి బయటకు వెళ్లే ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్తారు. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసిన తర్వాత ప్రశంసలు కురిపించారని చెప్పారు.
Also Read : Imanvi : పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన ‘ఫౌజీ’ హీరోయిన్
ఈ సందర్భంగా సినిమాపై ఆసక్తిని పెంచేందుకు చిత్రబృందం ఒక బంపర్ కాంటెస్ట్‌ను ప్రకటించింది. సినిమా కథను రిలీజ్‌కు ముందే కరెక్ట్‌గా గెస్ చేసిన వారికి రూ.5 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గెస్ చేసిన కథను 8019246552 నంబర్‌కు పంపించాలని, విజేతకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రైజ్ మనీ అందజేస్తామని తెలిపారు. కొత్త తరహా ప్రమోషన్లు ద్వారా ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ప్రయత్నం ఎర్రచీర టీమ్ చేస్తోంది. కుటుంబంతో కలిసి చూడదగిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో భావోద్వేగాన్ని రేకెత్తిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.