బ్రెజిల్‌లో ఈగ క‌ళ క‌ళ‌!

eega gets two national awardsరాజ‌మౌళి ఈగ ఇంకా త‌న స‌త్తా చాటుతూనే ఉంది. ఇంటా బ‌య‌టా అవార్డులు గెలుస్తూనే ఉంది. తాజాగా ఈగ ఖాతాలో మ‌రో ప్రతిష్టాత్మక‌మైన అవార్డు చేరింది. బ్రెజిల్ చ‌ల‌న చిత్రత్సవంతో ఉత్తమ క‌ళాద‌ర్శకుడిగా ర‌వీంద‌ర్ అవార్డు గెలుచుకొన్నారు. వ్యక్తిగ‌త విభాగంలో ఓ తెలుగువాడికి బ్రెజిల్‌లో పుర‌స్కారం ద‌క్కడం ఇదే తొలిసారి. అవార్డు పొంద‌డం ప‌ట్ల ర‌వీంద‌ర్ త‌న సంతోషాన్ని వ్యక్తం చేశారు. ”ఈ సినిమా కోసం చాలా క‌ష్టప‌డ్డా. రాజ‌మౌళిగారి స‌హాయం మ‌ర్చిపోలేనిది. ఈ సినిమా కోసం దాదాపు 25 డ‌మ్మీ ఈగ‌ల్ని త‌యారు చేశాం. ఒక్క ఈగ‌ను త‌యారు చేయ‌డానికి ఒక్క రోజు ప‌ట్టేది. ప్రతినాయ‌కుడి ఇల్లు, అందులో క‌నిపించే ప్రతి వ‌స్తువూ మేం త‌యారు చేసిన‌దే. ఇందులో క‌థానాయిక‌గ మైక్రో ఆర్టిస్ట్‌గా న‌టించింది. ఆమె మెడ‌లో గొలుసు త‌యారు చేయ‌డానికి కొన్ని రోజులు ప‌ట్టింది. పైగా అవ‌న్నీ స‌హ‌జంగా ఉంటాయి. సెట్ ప్రాప‌ర్టీ అంటే జ‌నాలు ఎవ్వరూ న‌మ్మలేదు. అందుకే అవార్డు వ‌చ్చింద‌నుకొంటా..” అంటున్నారాయ‌న‌.