Site icon TeluguMirchi.com

ఆఫర్ల కోసం హీరోయిన్సే బెడ్ పైకి వెళుతున్నారు

చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విధానం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రాధిక ఆప్టే లాంటి హీరోయిన్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన సందర్భాలున్నాయి. ఓ సీనియర్ హీరో తనను రాత్రికి రమ్మన్నాడంటూ రాధిక ఆప్టే ఆమధ్య పెద్ద సంచలనమే సృష్టించింది.
అయితే కాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా వుంది. కాస్టింగ్ కౌచ్ అంశంలో నిర్మాతలనే ఎందుకు బాధ్యులను చేస్తున్నారని ప్రశ్నించింది ఏక్తా.

చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం తమంతట తామే నిర్మాతల దగ్గరకు వెళతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవర్, పొజిషన్‌ లో ఉన్నారు కదా అని నిర్మాతలను నిందించడం సరికాదని ఏక్తా హితవు పలికింది. ఒక హీరోయిన్ అర్ధరాత్రి నిర్మాతను కలిసి, తరువాతి రోజు తనకు సినిమాలో అవకాశం ఇవ్వమంటే తప్పెవరిది? అని ప్రశ్నించింది. ఆ సినిమాలో ఆమెకు సెట్ అయ్యే పాత్ర లేనప్పుడు దోషిగా ఎవరిని నిలబెట్టాలి? అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతుంది.

Exit mobile version