Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ లవర్ బయటపడింది..

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి ఐదేళ్లు గడుస్తున్నా ఈషా రెబ్బ కు మాత్రం మంచి బ్రేక్ రాలేదు. ఈ నేపథ్యం లో ఆమెకు అదృష్టం ఎన్టీఆర్ రూపం లో తలుపు తట్టింది. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్రం లో కీలక పాత్ర చేసే అవకాశం లభించింది. నిన్నటి వరకు ఈ రోల్ ఫై పెద్దగా ఎవరు మాట్లాడుకోలేదు కానీ తాజాగా ఆ రోల్ ఏంటో బయటపడే సరికి అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

అరవింద లో ఈషా రెబ్బ ఎన్టీఆర్ కు లవర్ గా కనిపించబోతుందట. ఎన్టీఆర్ – ఈషా రెబ్బ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయని , అవి ప్రేక్షకులకు , అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బ మారుతీ బ్రాండ్ బాబు సినిమాలో నటిస్తుంది. గ్లామర్ పాత్రకు భిన్నంగా పనిమనిషిగా పాత్రలో నటించింది. ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. అలాగే సుమంత్ సరసన సుబ్రమణ్యపురం సినిమాలో కూడా ఈషా నటిస్తుంది. ఈ మూడు చిత్రాలు హిట్స్ సాధిస్తే ఈషా రెబ్బ వెనకకు చూడనవసరం లేదు. చూద్దాం ఈ మూడు ఈషా రెబ్బ ను ఏ స్థాయికి తీసుకెళ్తాయో.

Exit mobile version