కేన్స్ ఫెస్టివల్ లో వాలనుంది

eega gets two national awardsరాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ సినిమా ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ లో ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డుతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పలు అవార్డులు అందుకున్న ఈగ ఇప్పుడు ఎగురుకుంటూ పోయి అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా వాలనుంది. ఈ చిత్రాన్ని త్వరలో జరగబోయే కేన్స్ లో ప్రదర్శించేందుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఈగ ’ చిత్రంతో పాటు, ‘బాహుబలి ’ చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా కేన్స్ ప్రదర్శించబోతున్నాం అని తెలిపారు. ఈ చిత్రోత్సవం ఫిలిమ్ మా ర్కెట్ (Marché du Film) విభాగంలో ప్రదర్శించడానికి ‘ఈగ’ ఎంపికైంది.