Eagle : నాకు విపరీతంగా నచ్చిన గెటప్ ఇది : రవితేజ


మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ఫుల్ గా జరిగింది.

ప్రీరిలీజ్ రిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలోని దాదాపు నటీనటీనటులతో పని చేయడం ఇదే తొలిసారి. నవదీప్‌కు బలమైన క్యారెక్టర్‌ దక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో తనకి మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. ఎవరూ ఊహించలేని విధంగా డైలాగ్స్‌ చెప్పాడు. ఇద్దరం కలిసి ఓ కామెడీ సినిమాలో చేయాలని వుంది. తనలో చాలా మంచి హ్యుమర్ వుంది. శ్రీనివాస్ రెడ్డి, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్.. అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. డేవ్ జాండ్.. రాక్ స్టార్. అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. తను భవిష్యత్ లో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. మాస్టర్ ద్రువన్ పాత్రతో చిన్నపిల్లలు కనెక్ట్ అవుతారు. విశ్వ ప్రసాద్ గారు, వివేక్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటింది. ఈ ప్రొడక్షన్ లో ఎన్ని సినిమాలు చేయడానికైనా సిద్ధమే. అంత కంఫర్ట్ వుంటుంది. విశ్వ ప్రసాద్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. మణి చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశాడు. అనుపమ పాత్రే ఈ సినిమా కథను నడిపిస్తుంది. కావ్య లవ్లీ క్యారెక్టర్ చేసింది. డైరెక్టర్ కార్తిక్ కి విపరీతమైన క్లారిటీ వుంది. ఎక్స్ ట్రార్డినరీ గా తీశాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి తనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నాకు నేను విపరీతంగా నచ్చిన గెటప్ లో కనిపిస్తాను. ఈ గెటప్ రావడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. ఫస్ట్ టైం ఇలాంటి మేకోవర్. అందరిలానే నేను ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నాను. ఫిబ్రవరి 9న థియేటర్స్ లో కలుద్దాం. జై సినిమా” అన్నారు.

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. “ఈగల్ ఎండ్ టైటిల్ కార్డ్స్ చూస్తున్నప్పుడు దాదాపు 300పైగా టీం మెంబర్స్ పేర్లు కనిపించాయి. ఇంతమంది పని చేయడం గర్వంగా అనిపించింది. ఇంతమంది వర్క్ చేయడానికి కారణం మాత్రం రవితేజ గారు నాకు ఇచ్చిన అవకాశం. రవితేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. రైటింగ్ మణి, ఆర్ట్ డైరెక్టర్ నాగేందర్, మ్యూజిక్ డేవ్ జాండ్, డైరెక్షన్, ఎడిటింగ్ టీం అందరూ అద్భుతమైన పని తీరు కనపరిచారు. ఇందులో నటీనటులు కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ప్రయత్నించాం. ఖచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఈగల్ గొప్ప థియేటట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి” అని కోరారు.