దేనికైనా రెడీ తో ఫామ్‌లోకి వచ్చారు విష్ణు. యాక్షన్, వినోదం మేళవింపు ఆయనకు బాగా కలిసొచ్చిన ఫార్ములా. ఢీ కూడా అలాంటి కథే. ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములాతో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దూసుకెళ్తా. లావణ్య కథానాయిక. వీరూ పోట్ల దర్శ కత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఉగాది సందర్భంగా విడుదల చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. విష్ణు, లావణ్య జంట తప్పకుండా ఆకట్టుకొంటుందని.. విష్ణు చేసిన పోరాటాలు మాస్‌ని నచ్చుతాయని దర్శకుడు చెబుతున్నారు.