Site icon TeluguMirchi.com

రాజు వచ్చినాడు.. ‘కింగ్ ఆఫ్ కోత’ టీజర్ !


మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కోత’. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని అభిలాష్‌ జోషి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు.

రాజు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అనే సంభాషణలతో టీజర్‌ మొదలవుతుంది. కోత ప్రజలను విలన్ల నుంచి రక్షించే గ్యాంగ్‍స్టర్‌గా దుల్కర్ నటిస్తున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇక ఒకటిన్నర నిమిషాలు ఉన్న టీజర్ గ్యాంగ్‍స్టర్లు, యాక్షన్ సీన్లు, పోలీసులతో చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ముఖ్యంగా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‍ అని చెప్పవచ్చు. యూట్యూబ్ లో తెలుగు టీజర్ చూడాలంటే సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లి తెలుగు భాషని సెలెక్ట్ చేసుకోవాలి.

King of Kotha Official Teaser | Dulquer Salmaan | Abhilash Joshiy | Jakes Bejoy

ఈ మూవీలో డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడచెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా షాన్ రెహ్మాన్‌, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఓనమ్‌ 2023 కానుకగా పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version