యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా ఎవరు టచ్ చేయలేని స్థానానికి చేరుకున్నాడు. ప్రభాస్ తదుపరి చిత్రాన్ని సుజిత్ దర్శకత్వంలో నటించనున్నాడు. 150కోట్లతో రూపొందనున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇటీవలె ఈ చిత్ర టీజర్ కూడా విడుదలయ్యి భారీ అంచనాలను నెలకొల్పుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో రొమాన్స్ చేయడానికి బాలీవుడ్ భామ కోసం చిత్ర యూనిట్ గాలింపులు చేపడుతున్నారు. ‘బాహుబలి’ చిత్రం వల్ల దాదాపు అయిదేళ్లు కష్ట పడిన ప్రభాస్ ప్రస్తుతం ఫారెన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఫారెన్ నుండి తిరిగి వచ్చాక ‘సాహో’ చిత్రీకరణలో పాల్గోంటాడు.
భారీ కమర్షియల్ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో తలపడడానికి కూడా బలమైన విలన్ కావాలి. అందుకు తగ్గ విలన్‌ను తాజాగా చిత్ర యూనిట్ ఎంపిక చేశారు. రామ్ చరణ్ ‘ధృవ’ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన అందమైన విలన్ అరవింద్ స్వామిని ‘సాహో’లో విలన్‌గా ఎంపిక చేశారు. చెర్రీ విలన్‌తో ప్రభాస్ కూడా తలపడనున్నాడు. సుజిత్ ప్రభాస్ స్టామినాకు తగ్గ చిత్రాన్ని రూపొదించాలని ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.. అందుకే ‘ధృవ’ చిత్రంలో మంచి నటన కనబర్చిన అరవిందస్వామిని ‘సాహో’ తలపడడానికి ఎంపిక చేశారు.