ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ హాట్ టాపిక్. ఏ నోట విన్నా… ఎవరిని కదిపినా టాలీవుడ్ డ్రగ్స్ మత్తులో జోగుతుందంటూ ఒక్కటే ముచ్చట. కొంత మంది సెలబ్రిటీలకు నోటీసులు కూడా వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ విచారం వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది డ్రగ్స్ వాడుతున్నట్లు వార్తలు రావడం బాధాకరం. 10 మందికి నోటీసులు వచ్చినంత మాత్రాన మొత్తం ఫిలిం ఇండస్ర్టీనే తప్పు పట్టడం సమంజసం కాదు. కొంత మంది పెద్ద నిర్మాతల పిల్లలకు బదులుగా వేరే వాళ్ల పేర్లను సూచిస్తున్నారని అంటున్నారు. అదీ కరెక్ట్ కాదు. ఇక్కడ తప్పు చేసిన ఏ ఒక్కరు తప్పించుకోలేరు. ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకుంటే దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. పోలీస్ అధికారి అకున్ సబర్వాల్ కేస్ ఇన్వస్టిగేషన్ చేస్తున్నారు. ఆయన సెలవులను సైతం క్యాన్సిల్ చేసుకుని ప్రత్యేక శ్రద్దతో దర్యాప్తు చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే తప్పు చేయని వాళ్లకు టీ-ఫిలిం ఛాంబర్ తరుపున మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నోటీసులు అందుకున్న వారు కూడా ముద్దాయిలు కారు. కేవలం వాళ్లను విచారణకు హజరవ్వాలనే కోరారు. దోషులెవరు…నిర్దోషులెవరన్నది అక్కడే తేల్తుంది. సినిమా స్టార్లు అంటే రోల్ మోడల్స్. ఆ ప్రభావం సమాజంపై తీవ్రంగా పడుతుంది. సమాజాన్ని ప్రభావితం చేసే తప్పుడు పనులు మళ్లీ పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా` అని అన్నారు.
తెలంగాణ ఫిలిం చాంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కవిత మాట్లాడుతూ, ` ఎందరో గొప్ప నటుల వల్ల తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంది. మనది బంగారం లాంటి ఇండస్ర్టీ. కానీ కొంత మంది వల్ల పరిశ్రమ బ్రష్టు పట్టి పోతుంది. డ్రగ్స్ వంటి మత్తు మహమ్మారిని పబ్బుల్లోనే సప్తై చేస్తున్నారు. ఆ పబ్ లు కూడా ఇప్పటి కొంత మంది యంగ్ హీరోలు రన్ చేస్తున్నారు. అలాంటి పబ్ లను ప్రభుత్వం తక్షణమే బ్యాన్ చేయాలి. లేదంటే డ్రగ్స్ మత్తు నుంచి బయట పడడటం కష్టం. సినిమాల్లో అవకాశాలు రాలేదని..ప్రెస్టేషన్ కు గురై మత్తుకు బానిసవుతున్నారు. అలాంటి వాళ్లంతో చీకటిని వదిలి వెలుగు లోకి రావాలి. ఎక్కువ సమయం కుటుంబంతో గడపాలి. అలాగే ఔటింగ్ కు వెళ్తే అలాంటి బాధల నుంచి ఉపశమనం దొరుకుతుంది. నాకు పదేళ్ల నుంచి అవకాశాలు లేవు. అలాగని నేను ఏ మత్తుకు బానిస కాలేదు. ఇప్పటి తరం వారంతా నిజమైన జీవితాన్ని గ్రహించాలి. డ్రగ్స్ పై అవేర్నస్ కార్యక్రమాలు చేపట్టాలని` అన్నారు.