Site icon TeluguMirchi.com

Double Ismart : డబుల్ ఎనర్జీతో ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్.. ఇక మాస్ జాతరే !


Double Ismart Trailer : ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ గా ఈ చిత్రం రానుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసారు మేకర్స్.

Also Read : Filmfare Awards : 6 ప్రెస్టిజియస్ విన్స్ తో నాని ‘దసరా’ మూవీ రికార్డు

ట్రైలర్ అన్ని కమర్షియల్ హంగులతో అదరగొట్టింది. లవ్ ట్రాక్ యూత్‌ఫుల్ అయితే, మదర్ సెంటిమెంట్ మరో కీ ఎలిమెంట్. అలాగే మూవీలో పూరి ట్రేడ్‌మార్క్ మాస్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. వన్‌లైనర్లు బుల్లెట్‌లా పేలాయి. పూరి టేకింగ్ చాలా స్టైలిష్‌గా వుంది. సినిమా విజువల్‌గా అద్భుతంగా వుంది. శివలింగం వద్ద క్లైమాక్స్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. ఇక రామ్ డబుల్ ఇస్మార్ట్ పాత్రలో అద్భుతంగా కనిపించారు. తన డైలాగ్స్, పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో డబుల్ ఎనర్జీని తెచ్చారు. సంజయ్ దత్ బిగ్ బుల్‌గా టెర్రిఫిక్ గా వున్నారు. కావ్య థాపర్ సూపర్-హాట్‌గా కనిపించింది. మణిశర్మ అద్భుతమైన మ్యూజిక్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి స్టైలిష్ డైరెక్షన్, ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్‌లు, ఇంటెన్స్ యాక్షన్‌ల బ్లెండ్ తో ట్రైలర్ అద్భుతంగా వుంది.

Also Read : Filmfare Awards : ఐదు అవార్డ్స్ తో సత్తా చాటిన కల్ట్ బ్లాక్ బస్టర్ ‘బేబి’

Double ISMART Trailer ( Telugu) | Ram Pothineni | Sanjay Dutt | Puri Jagannadh | AUGUST 15th RELEASE

Exit mobile version