Site icon TeluguMirchi.com

Double Ismart : ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే ?


ఉస్తాద్‌ రామ్‌ పోతినేని, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ తో పాటు మాస్ సాంగ్- స్టెప్పా మార్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ చిత్ర షూటింగ్ ముగిసినట్లు ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ తో అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.

Also Read : బింబిసార2.. ప్రీక్వెల్‌ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్ !

పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్ మరియు ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Exit mobile version